జింబాబ్వే ఓ టీ10 లీగ్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ లీగ్ పేరు జింబాబ్వే క్రికెట్ 'జిమ్ ఆఫ్రో టీ10'. ఇక జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఆ ప్రాంచైజీ పేరు హరారే హరికేన్స్ ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సర్ సోహన్ రారుతో కలిసి హరారే ఫ్రాంచైజీని సంజయ్ దత్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని సంజయ్ కూడా ధృవీకరించాడు. ''భారత్‌లో క్రికెట్ ఒక మతం వంటింది. అదే విధంగా ప్రపంచక్రికెట్‌లో భారత్ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలో ప్రతీ చోట క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగాలని నేను ఎప్పుడూ ఆశిస్తాను. జింబాబ్వే కూడా గొప్ప క్రీడా చరిత్రను కలిగిఉంది. అటువంటి జింబాబ్వే క్రికెట్‌లో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. జిమ్ ఆఫ్రో టీ10లో హరారే హరికేన్స్ బాగా రాణిస్తుందని నేను అనుకుంటున్నాను'' అని సంజయ్ పేర్కొన్నాడు. ఈ లీగ్‌లో మిగతా జట్లు డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, ఫ్రాంచైజీలు ఉన్నాయి.










