Feb 15,2023 22:06

బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) మెంటార్‌గా భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్‌ ద్వారా బుధవారం వెల్లడించింది. 'ఆర్సీబీ మహిళా జట్టు మెంటార్‌గా సానియా మీర్జాను స్వాగతించడం మాకు సంతోషంగా, గౌరవంగా ఉంది, భారత మహిళల క్రికెట్‌ ఎంతో మార్పును చూడబోతోంది. ఇందులో భాగం కావాలని నేను ఎదురు చూస్తున్నా. అని ఆర్సీబీ విడుదల చేసిన వీడియోలో సానియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) మార్చి 4నుంచి ముంబయి వేదికగా తొలి సీజన్‌ ప్రారంభం కానుంది. 23రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు 20లీగ్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మార్చి 26న ఫైనల్‌ జరగనుంది.