న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ భారత్‌లో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానులైన 1000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. తమ బెంగళూరు, నోయిడా, ఢిల్లీలోని పరిశోధన, ఇన్స్‌ట్యూట్‌లలో వీరి అవసరం ఉందని తెలిపింది. 2023లో కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించింది.










