న్యూఢిల్లీ: ఆసియా హాకీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును యువ క్రీడాకారిణి సలీమ అందుకుంది. కొరియాలోని ముంగ్యోంగ్‌లో జరిగిన ఆసియా హాకీ ఫెడరేషన్(ఎహెచ్‌ఎఫ్) వార్షిక సర్వసభ్య సమావేశంలో సలీమాకు ఈ అవార్డును అందజేశారు. భారత మహిళల హాకీ జట్టుకు మిడ్‌ఫీల్డర్‌గా ఉన్న 20ఏళ్ల సలీమా.. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో భారతజట్టు సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించింది. సలీమా రెండేళ్లుగా భారతజట్టులో కీలక క్రీడాకారిణిగా కొనసాగుతోంది. 2018లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన 3వ యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో జాతీయ జూనియర్ జట్టు రజత పతకాన్ని సాధించడంలో, 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సీనియర్స్ జట్టులోకి అరంగేట్రం చేసింది. ఇక 2021 ఎఫ్‌ఐహెచ్ హాకీ మహిళల జూనియర్ ప్రపంచకప్‌లో భారతజట్టు నాల్గో స్థానంలో నిలవడంలోనూ కీలకపాత్ర పోషించింది.










