Aug 06,2023 21:34

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్యకార్మికులకు చెల్లించాల్సిన మే, జూన్‌ నెల వేతనాలను తక్షణమే బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారసంస్థ (సిఆర్‌డిఎ) కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికుల నిర్వహణ చూస్తున్న ఏజెన్సీ స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయడంతో జీతాలు అలస్యమయ్యాయని పేర్కొన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను తక్షణమే జమ చేయాల్సిందిగా పాత ఏజెన్సీని ఆదేశించామని తెలిపారు.