Jun 23,2023 22:01

- వెస్టిండీస్‌ పర్యటనకు జట్లను ప్రకటించిన బిసిసిఐ
ముంబయి: వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) శుక్రవారం వెల్లడించింది. ప్రపంప టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమితో దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా యువకులకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వెస్టిండీస్‌ పర్యటనకు యువ క్రికెటర్లకు తొలి ప్రాధాన్యతనిచ్చి.. ఛటేశ్వర పుజారాకు టెస్టులనుంచి తప్పించింది. టెస్టులు, వన్డేలకు రోహిత్‌ శర్మ సారథ్యం వహించనున్నాడు. అజింక్యా రహానే టెస్టుల్లో తన స్థానాన్ని నిలబెట్టుకొని వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. డబ్ల్యూటిసి ఫైనల్లో విఫలమైన ఛటేశ్వర్‌ పూజారాపై వేటు పడింది. సీనియర్‌ పేసర్‌ షమీకి విశ్రాంతి నిచ్చారు. వీరి స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌, ముఖేష్‌ కుమార్‌ చోటు దక్కించుకున్నారు. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ సంజూ శాంసన్‌తోపాటు నవ్‌దీప్‌ సైనీలకు వన్డే జట్టులో చోటు దక్కింది. అలాగే ఐపిఎల్‌ సీజన్‌-16లో అదరగొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌, ఫాస్ట్‌ బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ వన్డే, టెస్టు జట్టులోని 16 మందిలో చోటు సంపాదించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టాండ్‌బైగా ఎంపికైన యువ సంచలనం యశస్వీ జైస్వాల్‌ టెస్టు జట్టులోకి వచ్చాడు.టెస్టులు : రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, కోహ్లీ, జైస్వాల్‌, రహానే(వైస్‌ కెప్టెన్‌), కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్లు), అశ్విన్‌, జడేజా, శార్దూల్‌, అక్షర్‌, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఉనాద్కట్‌, నవదీప్‌ సైనీ.
వన్డే : రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్లు), హార్దిక్‌(వైస్‌ కెప్టెన్‌), జడేజా, శార్దూల్‌, అక్షర్‌, చాహల్‌, కుల్దీప్‌, ఉనాద్కట్‌, సిరాజ్‌, ఉమ్రాన్‌, ముకేశ్‌.
షెడ్యూల్‌..
జులై 12-16 : తొలిటెస్ట్‌(విండ్సోర్‌ పార్క్‌, డొమినిక)
జులై 20-24 : రెండోటెస్ట్‌(క్వీన్స్‌ పార్క్‌, ట్రినిడాడ్‌)
జులై 27 : తొలి వన్డే(బార్బొడాస్‌)
జులై 29 : రెండో వన్డే(బార్బొడాస్‌)
ఆగస్టుా1 : మూడో వన్డే(ట్రినిడాడ్‌)