Apr 24,2023 09:46

ముంబయి : భారత క్రికెట్‌ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న సచిన్‌ టెండూల్కర్‌ ఈ నెల 24తో 50వ పడిలోకి ప్రవేశిస్తున్నాడు. క్రికెట్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించి తన పేరుపై లెక్కలేనని రికార్డులు రాసుకున్న సచిన్‌ బర్త్‌ పుట్టిన రోజు అభిమానులకు చాలా ముఖ్యమైన రోజు. సచిన్‌ పుట్టిన రోజు సందర్భంగా అతని గురించి అనేక ఆస్తకర విషయాల్లో కొన్ని ... ఫిబ్రవరి 1988లో సచిన్‌ టెండూల్కర్‌-వినోద్‌ కాంబ్లీ కలిసి 664 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పోటీ క్రికెట్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఆ మ్యాచ్‌లో సచిన్‌ 326 పరుగులతో అజేయంగా నిలిచాడు. నవంబరు 1989లో 16 ఏళ్ల వయసులో సచిన్‌ కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ అడుగుపెట్టాడు. అయితే తరువాత ఏడాది అంటే ఆగస్టు 14, 1990లో ఓల్డ్‌ మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో సచిన్‌ తొలి సెంచరీ నమోదు చేశాడు. 1996 వన్డే ప్రపంచకప్‌లో 523 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 24 ఫిబ్రవరి 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో అజేయంగా 200 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.