వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ మూడోరౌండ్‌లోకి 2వ సీడ్ సబలెంక(రష్యా), చెక్ రిపబ్లిక్‌కు చెందిన 9వ సీడ్ పెట్రా క్విటోవా, అమెరికాకు చెందిన 25వ సీడ్ కీస్ ప్రవేశించారు. శుక్రవారం జరిగిన రెండోరౌండ్ పోటీలో క్విటోవా 6-2, 6-2తో సన్సోవిచ్(రష్యా)పై, కీస్ 7-5, 6-3తో గోలుబిక్(స్విట్జర్లాండ్)పై వరుససెట్లలో గెలిచారు. మరో పోటీలో 29వ సీడ్ బెగూ(రొమేనియా) 5-7, 3-6తో అన్‌సీడెడ్ బ్లింకోవా(రష్యా) చేతిలో వరుససెట్లలో ఓడింది. మరో పోటీలో సబలెంకా 2ా6, 7ా5, 6ా2తో గ్రఛేవా(ఫ్రాన్స్)ను ఓడించి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లింది.
అల్కరాజ్, మెద్వదెవ్, రూనే జోరు..
పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్, స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్, 3వ సీడ్ డానియెల్ మెద్వదెవ్, 6వ సీడ్ రూనే(స్విట్జర్లాండ్) మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన రెండోరౌండ్ పోటీలో అల్కరాజ్ 6-4, 7-6(7-2), 6-3తో ముల్లర్(ఫ్రాన్స్)పై, మెద్వదెవ్ 6-3, 6-3, 7-6(7-5)తో మన్నారిండో(ఫ్రాన్స్)పై, రూనే 6-3, 7-6(7-3), 6ా3తో కర్బెలేస్(స్పెయిన్)పై గెలిచారు. మరో పోటీలో అన్‌సీడెడ్ బెర్రెట్టిని(ఇటలీ) 6-3, 6-4, 6-4తో 15వ సీడ్ డి-మినార్(ఆస్ట్రేలియా)కు, 17వ సీడ్ హుర్క్‌రాజ్(పోలండ్) 7-6(7-4), 6-4, 6-4తో 14వ సీడ్ మసెట్టి(ఇటలీ)ని చిత్తుచేశారు. 19వ సీడ్ జ్వెరేవ్(జర్మనీ) 6-4, 5-7, -2, 6-2తో వతనుకి(జపాన్)పై గెలిచాడు.










