Oct 06,2023 15:13

అమరావతి: ఏపీలో 411 ఎస్సై పోస్టుల భర్తీకి తుది రాత పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్‌ 12వ తేదీ వరకు హాల్‌టికెట్లను ఎపిఎస్‌ఎల్‌పిఆర్‌బి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ఎస్సై తుది రాత పరీక్షలు జరగనున్నాయి. హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏవైనా సమస్యలు ఎదురైతే 9441450639, 9100203323 నంబర్లలో సంప్రదించవచ్చు.