హైదరాబాద్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) కింద ఎస్‌బిఐ ఉద్మోగులు బలహీనవర్గాలకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్టోబర్ తొలి వారంలో '.జారు ఆఫ్ గివింగ్' వారోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఉద్యోగులు, సిబ్బంది ఇచ్చిన బట్టలు, స్టేషనరీ, నిత్యావసరాల ఉత్పత్తులను గురువారం ఆ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ సిజిఎం అమిత్ జింగ్రాన్ పలు స్వచ్ఛంద సంస్థలకు అందజేశారు.










