May 09,2023 09:23
  • పంజాబ్‌ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం

కోల్‌కతా : ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సత్తా చాటింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి ప్లే-ఆఫ్స్‌ రేసులో నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నస్టానికి 179పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కతా జట్టు చివరి వరకూ పోరాడి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి గెలిచింది. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన దశలో రింకూ సింగ్‌ ఫోర్‌ కొట్టి కోల్‌కతాకు విజయాన్ని చేకూర్చాడు. దీంతో కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది.
          ఇక టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను కెప్టెన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(57: 47 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధసెంచరీకి తోడు, చివర్లో షారుక్‌ ఖాన్‌(21), హర్‌ప్రీత్‌ బ్రార్‌(17) బ్యాటింగ్‌లో ధనాధన్‌ ఆడారు. హర్షిత్‌ రానా వేసిన 20వ ఓవర్లో షారుక్‌ ఖాన్‌(21) కొట్టాడు. తొలి బంతికి లాంగాన్‌లో సిక్సర్‌ కొట్టిన షారుక్‌.. రెండు, మూడు బంతుల్ని బౌండరీకి తరలించాడు. హర్‌ప్రీత్‌ బ్రార్‌(17) ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో 21 పరుగులు వచ్చాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ ప్రభుసిమ్రాన్‌ సింగ్‌(12), భానుక రాజపక్సే(0)ను వరుస ఓవర్లలో హర్షిత్‌ రానా పెవిలియన్‌ పంపాడు. పవర్‌ ప్లేలో దంచి కొట్టిన విధ్వసంక ఆటగాడు లివింగ్‌స్టోన్‌(15), జితేశ్‌ శర్మ(21), రిషి ధావన్‌(19)లను వరుణ్‌ చక్రవర్తి ఔట్‌ చేశాడు. ఆఖర్లో హర్‌ప్రీత్‌ బ్రార్‌(12), రెండు షారుక్‌ ఖాన్‌(6) ధనాధన్‌ ఆడి పంజాబ్‌కు పోరాడగలిగే స్కోర్‌ అందించారు.
        ఛేదనలో కోల్‌కతా ఓపెనర్‌ జేసన్‌ రారు(38), నితీశ్‌ రాణా(51), రస్సెల్‌(42), రింకూ సింగ్‌(21నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. రాహుల్‌ ఛాహకు రెండు వికెట్లు లభించాయి.
 

స్కోర్‌బోర్డు..
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి)గుర్బాజ్‌ (బి)హర్షీత్‌ రాణా 12, ధావన్‌ (సి)వైభవ్‌ అరోరా (బి)నితీశ్‌ రాణా 57, రాజపక్సె (సి)గుర్బాజ్‌ (బి)హర్షీత్‌ రాణా 0, లివింగ్‌స్టోన్‌ (ఎల్‌బి) చక్రవర్తి 15, జితేశ్‌ శర్మ (సి)గుర్బాజ్‌ (బి)వరణ్‌ చక్రవర్తి 21, సామ్‌ కర్రన్‌ (సి)గుర్బాజ్‌ (బి)సూర్యాంశ్‌ శర్మ 4, రిషీ ధావన్‌ (బి)వరణ్‌ చక్రవర్తి 19, షారుక్‌ ఖాన్‌ (నాటౌట్‌) 21, హర్‌ప్రీత్‌ బ్రార్‌ (నాటౌట్‌) 17, అదనం 13. (20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 179పరుగులు.
 

వికెట్ల పతనం : 1/21, 2/29, 3/53, 4/105, 5/119, 6/139, 7/139
బౌలింగ్‌ : వైభవ్‌ అరోరా 3-0-32-0, హర్షీత్‌ రాణా 3-0-33-2, రస్సెల్‌ 1-0-19-0, వరణ్‌ చక్రవరి త4-0-26-3, శ్రేయస్‌ శర్మ 4-0-26-1, నరైన్‌ 4-0-29-0, నితీశ్‌ రాణా 1-0-7-1.