Jan 04,2023 20:35

న్యూఢిల్లీ : ఫోన్‌ పే తన ప్రధాన కార్యలయాన్ని భారత్‌కు మార్చితే వాల్‌మార్ట్‌, ఫోన్‌ పే వాటాదారులు భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుందని సమాచారం. ఫోన్‌ పేలో ప్రధాన పెట్టుబడులు వాల్‌మార్ట్‌కు ఉన్నాయి. ప్రస్తుతం ఫోన్‌ పే ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. నిధుల సమీకరణ సులభతరానికి వీలుగా హెడ్‌ ఆఫీసును భారత్‌కు తరలించాలని భావిస్తోంది. అలా చేయలంటే భారత్‌కు దాదాపు ఒక్క బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8వేల కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు తెలిపాయి.