ఢిల్లీ :ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఆతిథ్యమిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కడుపునొప్పితో బాధపడుతుండడంతో అతడి స్థానంలో ముంబయి ఇండియన్స్ కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. టాస్ కు కూడా సూర్యానే వచ్చాడు. రోహిత్ శర్మ బదులు జట్టులోకి డువాన్ జాన్సెన్ వచ్చాడని సమాచారం.










