Apr 18,2023 20:58
  • ఐపిఎల్‌ చరిత్రలో నాల్గో బ్యాటర్‌

ముంబయి: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపిఎల్‌ల్లో 6వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. దీంతో ఐపిఎల్‌లో 6వేల పరుగులను కొట్టిన నాల్గో బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ 227 ఇన్నింగ్స్‌లో 6వేల మార్క్‌ను అందుకున్నాడు. ఇక వార్నర్‌(165 ఇన్నింగ్స్‌), కోహ్లి(188ఇన్నింగ్స్‌), ధావన్‌(199 ఇన్నింగ్స్‌) రోహిత్‌ శర్మకంటే ముందే 6వేల పరుగుల మార్క్‌ను సాధించారు.