Jul 07,2023 22:20

బిసిసిఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం
ముంబయి: ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళల జట్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఈమేరకు బిసిసిఐ అపెక్స్‌ కౌన్సిల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆసియా క్రీడలు జరిగే సమయంలోనే భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో పురుషుల ద్వితీయశ్రేణి జట్టును పంపాలని, మహిళల జట్టును మాత్రం పూర్తిస్థాయిలో పాల్గంటుందని వెల్లడించింది. సెప్టెంబర్‌ 28 నుంచి పురుషుల క్రికెట్‌, సెప్టెంబర్‌ 19నుంచి మహిళల క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. 2014లో చివరిసారిగా ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించినా.. భారతజట్టు ప్రాతినిధ్యం వహించలేదు. ఇక సెప్టెంబర్‌ాఅక్టోబర్‌లో చైనాలోని హాంగ్‌ఝూ వేదికగా ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో పాల్గనే ఇరుజట్ల జాబితాలను జులై 15న వెల్లడించనున్నట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌ 16న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ ప్రారంభం కానుండగా.. ఐపిఎల్‌ తరహాలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్స్‌తో ఆసియాకప్‌ టోర్నమెంట్‌ జరగనుందని, ఇంపాక్‌ ప్లేయర్‌ ఎవరనే విషయాన్ని టాస్‌కు ముందే ఇరుజట్ల కెప్టెన్లు వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది.