Jun 03,2023 21:26

న్యూఢిల్లీ : భారతీయ శిక్షా స్మృతిలోని దేశద్రోహం నిబంధనను సద్దుబాటు చేయడంపై లా కమిషన్‌ చేసిన సిఫార్సులు సమగ్రంగా లేవని, పైగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను అవి తోసిపుచ్చుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ కాలం చెల్లిన చట్టాన్ని శాసన పుస్తకాల నుండి తొలగించేందుకు తగిన చట్టపరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకునేవరకు దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అయితే, కనీస జైలు శిక్షను గతంలోని మూడు సంవత్సరాల నుండి ఏడేళ్ళకు పెంచడం ద్వారా దేశద్రోహం చట్ట నిబంధనలను లా కమిషన్‌ మరింత బలోపేతం చేసినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇడి, సిబిఐలను దారుణంగా దుర్వినియోగపరుస్తున్న నేపథ్యంలో ఈ సిఫార్సులు అరిష్టానిు కలగచేస్తాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన దేశద్రోహ చట్టానిు రద్దు చేయాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.