ఛండీగడ్: పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊరట లభించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్‌కు చెందిన లియాం లివింగ్‌స్టోన్ ఫిట్‌నెస్ సాధించాడు. ఫిట్‌నెస్ లేమి కారణంగా ఇంగ్లండ్‌లోనే ఉన్న లివింగ్‌స్టోన్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఇంగ్లండ్ క్రికెట్‌బోర్డు(ఇసిబి) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో పంజాబ్ జట్టు 10న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు 11.50కోట్లకు లివింగ్‌స్టోన్‌ను కొనుగోలు చేయగా.. గత సీజన్‌లో 182.08 స్ట్రయిక్‌రేట్‌తో 437పరుగులు చేశాడు. చీలమండ గాయం నుంచి కోలుకున్న లివింగ్‌స్టోన్ చివరిసారిగా టి20 ప్రపంచకప్‌లో ఆడాడు.
ఆర్సీబీకి పార్నెల్, విజరు కుమార్
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన టోప్లే ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. నొప్పితో మైదానం వీడిన అతను టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గత సీజన్‌లో దుమ్మురేపిన రజత్ పాటిదార్ (మధ్యప్రదేశ్) అషిల్లెస్ గాయం నుంచి కోలుకోలేదు. దాంతో డూప్లెసిస్ సేన వీళ్ల స్థానంలో ఇద్దరిని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడాడు. పుణే వారియర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు అతను ప్రాతినిధ్యం వహించాడు. ఈమధ్యే ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఈ ఎడమ చేతివాటం పేసర్ సత్తా చాటాడు. 9 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. 26 ఏళ్ల విజరు కుమార్ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు. కానీ, దేశవాళీలో నిలకడగా రాణించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 8 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు రంజీ ట్రోఫీలో 31 వికెట్లు తీసి కర్నాటక సెమీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 16వ సీజన్‌ను ఆర్సీబీ ఘనంగా ప్రారంభించింది. చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన ఆర్సీబీ అదే జోరును కొనసాగించడంలో విఫలమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 81 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 10న లక్నో సూపర్ జెయింట్స్‌తో డూప్లెసిస్ సేన తలపడనుంది.










