Jul 11,2023 22:15

సిరీస్‌ 2-1తో ఆఫ్ఘన్‌ కైవసం
చిట్టగాంగ్‌: మూడో, చివరి వన్డేలో బంగ్లాదేశ్‌ గెలిచి ఊపిరి పీల్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడి ఇప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న బంగ్లాదేశ్‌ జట్టు మంగళవారం జరిగిన మూడో వన్డేలో 7వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌పై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌ జట్టు 45.2ఓవర్లలో 126పరుగులకు ఆలౌటైంది. షోరిఫుల్‌ ఇస్లామ్‌(4/21), తస్కిన్‌(2/23), తైజుల్‌ ఇస్లామ్‌(2/33) బౌలింగ్‌లో మెరిసారు. ఛేదనలో బంగ్లా ఓపెనర్‌, కెప్టెన్‌ లింటన్‌ దాస్‌(53నాటౌట్‌), షకీబ్‌(39), తౌహిద్‌(22నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. ఫారుఖీకి రెండు, నబీకి ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షోరిఫుల్‌ ఇస్లామ్‌కు లభించగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ఫారుఖీకి లభించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆఫ్ఘన్‌ జట్టు 2-1తో చేజిక్కించుకొంది. ఇరుజట్ల మధ్య రెండు టి20ల సిరీస్‌ 14(శుక్ర)నుంచి ప్రారంభం కానుంది. ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ జట్టు 546పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.