Dec 15,2022 21:28

న్యూఢిల్లీ : ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వరుసగా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసిజి) రంగంలోకి ఇండిపెండెన్స్‌ బ్రాండ్‌లో అడుగు పెట్టింది. ఈ బ్రాండ్‌ను గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆవిష్కరించింది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ విభాగం నూతన బ్రాండ్‌లో అహార పదార్థాలు, నిత్యావసర సరుకులను విక్రయించనుంది.