Sep 13,2023 21:06

న్యూఢిల్లీ : ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ కొత్తగా 1.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.12,400) నిధులు సమీకరించడానికి చర్చలు జరుపుతోందని సమాచారం. ఇందుకోసం ప్రస్తుత తమ ఇన్వెస్టర్లతోనే సంప్రదింపులు చేస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. సింగపూర్‌, అబిదాబి, సౌదీ అరెబియా తదితర ప్రాంతాల్లోని సంస్థల నుంచి నిధుల సమీకరణలో ఉందని సమాచారం. ప్రస్తుత సెప్టెంబర్‌ ముగింపు నాటికి 3.5 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాలని నిర్దేశించుకోగా.. ఇప్పటికే ఒక బిలియన్‌ డాలర్లు సమకూర్చుకుంది.