న్యూఢిల్లీ : విమానయాన కంపెనీలకు ఇంధన భారం తగ్గనుంది. దేశీయ రిఫైనరీలు, చమురుహొఉత్పత్తి లాభాలపైహొవిండ్‌ఫాల్ టాక్స్‌నుహొభారీగా తగ్గిస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యేహొముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ సెస్‌ను టన్నుకు రూ. 4,900 నుంచి రూ.1,700కు తగ్గించింది.అదే విధంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్), డీజిల్ ఎగుమతులపై కూడా ఈ విండ్‌ఫాల్ టాక్స్‌కు కోత పెట్టింది. ఎటిఎఫ్‌పై విండ్‌ఫాల్ పన్నును మూడు రెట్లు తగ్గించి లీటరుకు రూ.5 నుండి రూ.1.5కు కోత పెట్టాగా.. డీజిల్ ఎగుమతిపై లీటర్‌కు సెస్‌ను రూ.8 నుండి రూ.5కు తగ్గించింది.










