న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ కొత్తగా సి53ని విడుదల చేసింది. 108 మెగాఫిక్సల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్‌తో తీసుకొచ్చిన ఈ మొబైల్ 4జిబి, 128 జిబి వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించింది. 4జి నెట్‌వర్క్ సపోర్ట్‌తో రూపొందించింది. ప్లిప్కార్డ్‌లో ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసే వారికి రూ.500 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. రూ.10వేల లోపు సెగ్మెంట్‌లో 108 ఎంపి కెమెరా ఫోన్ తమదేనని పేర్కొంది.










