Dec 01,2022 20:56

న్యూఢిల్లీ : ఎన్‌డిటివిలోని సుదీర్ఘకాలం పని చేసిన సీనియర్‌ జర్నలిస్టు రవీష్‌ కుమార్‌ ఆ సంస్థకు రాజీనామా చేశారు. రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత అయినా రవీశ్‌ కుమార్‌ రాజీనామా చేసిన విషయాన్ని ఎన్‌డిటివి గ్రూప్‌ ప్రెసిడెంట్‌ సుపర్ణ సింగ్‌ ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా తెలిపారు. తాను ఇకపై సొంత యూ ట్యూబ్‌ ఛానల్‌లో వార్తలను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్‌డిటివి ప్రమోటర్‌ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పిఆర్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు రాధికా రారు, ప్రణరు రారు డైరెక్టర్ల హోదా నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.