ప్రజాశక్తి- భీమవరం రూరల్ : తండ్రి తరువాత తండ్రిలా చూసు కోవాల్సిన చిన్నాన్న దారుణానికి ఒడిగట్టాడు. అన్న కూతురిపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన భీమవరంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... భీమవరం పట్టణంలోని లెప్రసీ కాలనీకి చెందిన అంజిబాబు, అరుణ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె (14) స్థానిక లూథరన్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎప్పటిలాగానే ఈ నెల 26న ఉదయం కూలి పనులకు వెళ్లారు. ఇదే అదునుగా రత్నకుమారి చిన్నాన్న మునుపు మావుళ్లు(37) భావించాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడం, ఎవరికైనా చెబుతుందనే భయంతో హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న తుప్పల్లో పడేశాడు. కూలి పనులకు వెళ్లి సాయంత్రానికి తిరిగివచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మరుసటిరోజు ఉదయం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవన్నీ మిగతా 2లో గమనిస్తున్న మావుళ్లు తనకేమీ తెలియనట్టు తను కూడా బాలిక కోసం వెతకసాగాడు. ఇంటి వెనుక తుప్పల్లో బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అప్పటికే మావుళ్లు తీరుపై అనుమానం ఉండడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. మావుళ్లు భార్య దుబారులో ఉంటున్నారు. వారి ఇద్దరు పిల్లలూ హాస్టల్లో చదువుతున్నారు. జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్, డిఎస్‌పి శ్రీనాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.










