న్యూఢిల్లీ: రాంచీ వేదికగా జరుగుతున్న ఓపెన్ నేషనల్ రేస్ వాకింగ్ కాంపిటీషన్‌లో మరో రెండు జాతీయ రికార్డులు నమోదయ్యాయి. 20కి.మీ. రేస్ వాకింగ్‌లో ఆకాశ్ దీప్ సింగ్, ప్రియాంక గోస్వామి తొలుత జాతీయ రికార్డులను బ్రద్దలు కొట్టగా.. బుధవారం 35కి.మీ. రేస్ వాకింగ్‌లో రాంబాబు, మంజు రాణి తమ పేరుమీద ఉన్న జాతీయ రికార్డులను తిరగరాసారు. పంజాబ్‌కు చెందిన 23ఏళ్ల ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంజు 35కి.మీ. రేస్ వాకింగ్‌ను 2గంటల 57నిమిషాల. 54సెకన్లలో గమ్యానికి చేరి ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గత ఏడాది జాతీయ క్రీడల్లో ఆమె పేర ఉన్న 3గంటల 04సెకన్ల జాతీయ రికార్డును బ్రేక్ చేసింది. ఇక రాంబాబు 2గంటల 31నిమిషాల, 36సెకన్లలో గమ్యానికి 2022లో తన పేర ఉన్న 2:36.34సెకన్ల రికార్డును తిరగరాసాడు.










