- 3 వికెట్ల తేడాతో టైటాన్స్ పై విజయం
- 26 బంతుల్లో 56 పరుగులు చేసిన హెట్మెయర్
నరేంద్ర మోడీ స్టేడియంలో 178 పరుగుల లక్ష్యఛేదనలో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది రాజస్థాన్ బ్యాట్స్ మన్‌హెట్మెయర్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 56 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. సంజూ విధ్వంసక బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేవలం 32 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. శాంసన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1), జోస్ బట్లర్ (0) నిరాశపరిచారు. ధృవ్ జురెల్ 18, అశ్విన్ 10 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో షమీ 3, రషీద్ ఖాన్ 2, హార్దిక్ పాండ్యా 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి అండ్ బి) బౌల్ట్ 4; గిల్ (సి) బట్లర్ (బి) సందీప్ శర్మ 45; సాయి సుదర్శన్ (రనౌట్) 20; హార్దిక్ పాండ్యా (సి) యశస్వి (బి) చహల్ 28; డేవిడ్ మిల్లర్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ శర్మ 46; అభినవ్ మనోహర్ (సి) పడిక్కల్ (బి) జంపా 27; తెవాటియా (నాటౌట్) 1; రషీద్ ఖాన్ (రనౌట్) 1; అల్జారి జోసెఫ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–5, 2–32, 3–91, 4–121, 5–166, 6–175, 7–176. బౌలింగ్: బౌల్ట్ 4–0–46–1, సందీప్ శర్మ 4–0–25–2, జంపా 4–0–32–1, అశ్విన్ 4–0–37–0, చహల్ 4–0–36–1.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) గిల్ (బి) హార్దిక్ 1; బట్లర్ (బి) షమీ 0; పడిక్కల్ (సి) మోహిత్ శర్మ (బి) రషీద్ ఖాన్ 26; సంజూ సామ్సన్ (సి) మిల్లర్ (బి) నూర్ అహ్మద్ 60; రియాన్ పరాగ్ (సి) మిల్లర్ (బి) రషీద్ ఖాన్ 5; హెట్‌మైర్ (నాటౌట్) 56; ధ్రువ్ జురేల్ (సి) మోహిత్ శర్మ (బి) షమీ 18; అశ్విన్ (సి) తెవాటియా (బి) షమీ 10; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.2 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–2, 2–4, 3–47, 4–55, 5–114, 6–161, 7–171. బౌలింగ్: షమీ 4–1–25–3, హార్దిక్ పాండ్యా 4–0–24–1, అల్జారి జోసెఫ్ 3–0–47–0, రషీద్ ఖాన్ 4–0–46–2, మోహిత్ శర్మ 2–0–7–0, నూర్ అహ్మద్ 2.2–0–29–1.










