- స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ రాజస్తాన్
జైపూర్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సంచలన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగి 154పరుగులే చేసిన లక్నో జట్టు ఆ తర్వాత రాజస్తాన్‌ను 144పరుగులకే పరిమితం చేసి 10 పరుగుల తేడాతో గెలిచింది. ఛేదనలో భాగంగా రాజస్తాన్ జట్టు 13ఓవర్లు పూర్తయ్యే సరికి 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఆ దశలో లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించి రాజస్తాన్‌ను కట్టడి చేశారు.
తొలుత రాజస్తాన్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. పేసర్ బౌల్ట్‌తోపాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో చెలరేగడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154పరుగులే చేయగల్గింది. లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మయర్స్ 10 ఓవర్ల వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 11వ ఓవర్లో జేసన్ హోల్డర్ బౌౌలింగ్‌లో కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత లక్నో జట్టు వరుసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కైల్ మేయర్స్(51) మినహా మిగతా బ్యాటర్స్ ఆకట్టుకోలేకపోయారు. కేఎల్ రాహుల్(39) పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ స్టొయినీస్(21), పూరన్(29) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్‌కు రెండు, బౌల్ట్, సందీప్ శర్మ, హోల్డర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
ఛేదనలో రాజస్తాన్‌కు అద్భుత ఆరంభం లభించింది. జైస్వాల్(44), బట్లర్(40) కలిసి తొలి వికెట్‌కు 87పరుగులు జతచేశారు. ఆ తర్వాత పడిక్కల్(26), రియాన్ పరాగ్(15) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఆవేశ్ ఖాన్‌కు మూడు, స్టొయినీస్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టొయినీస్‌కు లభించింది.
నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ (42 బంతుల్లో 51, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి తోడు చివర్లో నికోలస్ పూరన్ (20 బంతుల్లో 28, 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో లక్నో ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభమైంది. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు చేసింది 18 పరుగులే చేసింది. పవర్ ప్లే లో ఆ జట్టు 37 పరుగులు మాత్రమే చేయగలిగింది.39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ హౌల్డర్ బౌలింగ్‌లో బారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆవెంటనే వన్ డౌన్ లో వచ్చిన అయుష్ బదోని (1), దీపక్ హుడా (2) విఫలమయ్యారు. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో.. 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మేయర్స్ నిష్క్రమించిన తర్వాత వచ్చిన హిట్టర్స్ స్టోయినిస్ (16 బంతుల్లో 21, 2 ఫోర్లు), పూరన్‌లు క్రీజులో ఉన్నా నాలుగు ఓవర్లలో లక్నో 25 పరుగులే చేయగలిగింది. 19వ ఓవర్లో పూరన్ 6, 4, 4 బాదాడు. కానీ సందీప్ శర్మ వేసిన 20 ఓ వర్లలో 8 పరుగులే రాగా 3 వికెట్లు కూడా కోల్పోయింది. లక్నో. ఫలితంగా 20 ఓవర్లలో 154 పరుగులకే పరిమితమైంది. లక్నో బౌలర్లలో బౌల్ట్ 4 ఓవర్లు వేసి 16 పరుగులే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అశ్విన్ రెండు వికెట్లు, సందీప్, హౌల్డర్‌కు తలా ఓ వికెట్ దక్కింది.
- 18 ఓవర్లలో లక్నో స్కోరు 129/4
18 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. పూరన్ 10, స్టోయినిస్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- కైల్ మేయర్స్ 52 ఔట్.. లక్నో:104/4
52 పరగులు చేసిన కైల్ మేయర్స్ ఆశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు. మార్కస్ స్టోయినిస్ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది.
- దీపక్ హూడా ఔట్
2 పరుగులు చేసిన హూడా ఆశ్విన్ బౌలింగ్‌లో హెట్‌మేయర్‌కు క్యాచ్‌ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి వచ్చాడు.
- కైల్ మేయర్స్ 50
కైల్ మేయర్స్ 40 బంతుల్లో 50 పరుగులు చేశాడు. లక్నో ప్రస్తుతానికి 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
- అయుష్ బదోని ఔట్
నాలుగు బంతుల్లో 1 పరుగు చేసిన అయుష్ బదోని బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి దీపక్‌హూడా వచ్చాడు. లక్నో ప్రస్తుతానికి 86 పరుగులు చేసింది.
- తొలి వికెట్ డౌన్.. కేఎల్ రాహుల్ ఔట్.. లక్నో/83/1
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ హోల్డర్ బౌలింగ్‌లో బారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది.
9 ఓవర్లు పూర్తి.. లక్నో 74/0
9 ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్ 27 బంతుల్లో మూడు సిక్స్‌లు, 2 పోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లు వికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
- 6 ఓవర్లలో లక్నో స్కోరు 37/0
6 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 16, కేఎల్ రాహుల్ 19 పరుగులతో ఆడుతున్నారు.
- టాస్ గెలిచిన రాజస్థాన్.. లక్నోబ్యాటింగ్
ఐపీఎల్-2023లో భాగంగా జైపూర్‌లోని సువారు మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
జట్లు :
రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, జేసన్ హోల్డర్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, అయుష్ బదోని, నవీన్ ఉల్ హక్, యుధ్వీర్ సింగ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్










