Apr 08,2023 22:16

గౌహతి: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-16లో రాజస్తాన్‌ రాయల్స్‌ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(79), యశస్వి జైస్వాల్‌(60), అర్ధ శతకాలతో రాణించడంతో రాజస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 199పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాపార్డర్‌ బ్యాటర్లు చేతులెత్తేసినా.. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(65) ఒంటరి పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 9వికెట్లు కోల్పోయి 142పరుగులే చేయగల్గింది. దీంతో రాజస్తాన్‌ జట్టు 57పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఛేదనలో ట్రెంట్‌ బౌల్ట్‌ దెబ్బకు ఢిల్లీ ఖాతా తెరవక ముందే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. రెండో బంతికే పృథ్వీ షా(0), మూడో బంతికి మనీశ్‌ పాండే ఎల్బీగా వెనుదిరిగాడు. రిలీ రూస్సో(14) స్వీప్‌ షాట్‌ ఆడబోయి అశ్విన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో 36 పరుగులకే ఢిల్లీ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. లలిత్‌ యాదవ్‌(38), డేవిడ్‌ వార్నర్‌(65) ధాటిగా ఆడి నాలుగో వికెట్‌కు 64పరుగులు జోడించారు. ఆ తర్వాత పావెల్‌(2), అక్షర్‌ పటేల్‌(2) తొందరగా వెనుదిరిగారు. ట్రెంట్‌ బౌల్ట్‌, చాహల్‌కు మూడేసి, అశ్విన్‌ రెండు, సందీప్‌ శర్మకు ఒక వికెట్‌ దక్కాయి.

  • దంచి కొట్టిన బట్లర్‌, యశస్వీ

టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(79), యశస్వీ జైస్వాల్‌(60) అర్ధ శతకాలతో మెరిసారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 8.3ఓవర్లలో 98పరుగులు జతచేశారు. జైస్వాల్‌ 31బంతుల్లో 11ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 60పరుగులు చేయగా.. బట్లర్‌ 51బంతుల్లో 11ఫోర్లు, సిక్సర్‌తో 70పరుగులు చేశాడు. ప్రమాదకరమైన ఈ జోడీని ముఖేశ్‌ కుమార్‌ విడదీశాడు. జైస్వాల్‌ ఔటయ్యాక పరుగుల వేగం తగ్గింది. ఆఖర్లో హెట్‌మెయిర్‌(39) సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. బట్లర్‌, యశస్వీ తొలి వికెట్‌కు 98 రన్స్‌ జోడించారు. సంజూ శాంసన్‌(0), రియన్‌ పరాగ్‌(7) నిరాశ పరిచారు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి బట్లర్‌ ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఈ విధ్వంసక ఓపెనర్‌ 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 రన్స్‌ స్కోర్‌ చేశాడు. హెట్‌మెయిర్‌తో కలిసి స్కోర్‌ వేగం పెంచాడు. హెయిట్‌మెయిర్‌ ఆఖర్లో చెలరేగి ఆడడంతో రాజస్థాన్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు తీశాడు. కుల్దీప్‌ యాదవ్‌, రోవ్‌మన్‌ పావెల్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జైస్వాల్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌:
యశస్వి జైస్వాల్‌ (సి అండ్‌ బి)ముఖేశ్‌ కుమార్‌ 60, జాస్‌ బట్లర్‌ (సి అండ్‌ బి)ముఖేశ్‌ కుమార్‌ 79, సంజు శాంసన్‌ (సి)నోర్ట్జే (బి)కుల్దీప్‌ యాదవ్‌ 0, రియాన్‌ పరాగ్‌ (బి)రువాన్‌ పావెల్‌ 39, ధృవ్‌ జురెల్‌ (నాటౌట్‌) 8, అదనం 6. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 199పరుగులు.
వికెట్ల పతనం: 1/99, 2/103, 3/126, 4/175
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 2-0-31-0, నోర్ట్జే 4-0-44-0, ముఖేశ్‌ కుమార్‌ 4-0-36-2, అక్షర్‌ పటేల్‌ 4-0-38-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-31-1, రువాన్‌ పావెల్‌ 2-0-18-1.
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి)సంజు (బి)బౌల్ట్‌ 0, వార్నర్‌ (ఎల్‌బి)చాహల్‌ 65, మనీష్‌ పాండే (ఎల్‌బి)బౌల్ట్‌ 0, రూసో (సి)జైస్వాల్‌ (బి)అశ్విన్‌ 14, లలిత్‌ యాదవ్‌ (బి)బౌల్ట్‌ 38, అక్షర్‌ పటేల్‌ (స్టంప్‌)సంజు (బి)చాహల్‌ 2, రువాన్‌ పావెల్‌ (సి)హెట్‌మైర్‌ (బి)అశ్విన్‌ 2, అభిషేక్‌ పోరెల్‌ (సి)హెట్‌మైర్‌ (బి)చాహల్‌ 7, కుల్దీప్‌ యాదవ్‌ (నాటౌట్‌) 3, నోర్ట్జే (బి)సందీప్‌ శర్మ 0, ముఖేశ్‌ కుమార్‌ (నాటౌట్‌) 1, అదనం 10. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 142పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/0, 3/36, 4/100, 5/111, 6/118, 7/118, 7/138, 8/139, 9/140
బౌలింగ్‌: బౌల్ట్‌ 4-1-29-3, సందీప్‌ శర్మ 4-0-20-1, అశ్విన్‌ 4-0-25-2, హోల్డర్‌ 3-0-28-0, చాహల్‌ 4-0-27-3, మురుగన్‌ అశ్విన్‌ 1-0-11-0