May 12,2023 15:08

యశస్వి జైస్వాల్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో.. నిన్నటి మ్యాచ్‌లో కోల్‌కతా విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్‌ ఒక్క వికెట్టే కోల్పోయి కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో పాటు పాయింట్ల పట్టికలో కావాల్సినంత నెట్‌రన్‌రేట్‌నూ సంపాదించుకుంది. ఈ సందర్భంగా రాజస్థాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేసి తన రికార్డును బద్దలుకొట్టడంపై కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. యశస్వి ఇన్నింగ్స్‌కు 'హ్యాట్స్‌ ఆఫ్‌' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ''నేను చూసిన అత్యంత బెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి. యశస్విది ఎంతో అద్భుతమైన టాలెంట్‌'' అని విరాట్‌ మెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్‌లీ స్పందిస్తూ.. ఐపీఎల్‌లో యశస్వి ఇన్నింగ్స్‌ అద్భుతం. అతడిని బీసీసీఐ టీమ్‌ఇండియాలోకి తీసుకోవాలని ట్వీట్‌ చేశాడు.