ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేసిన 158 పరుగులు రహానే చేసిన విధ్వంసానికి చిన్నదైపోయింది.19 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న రహానే సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ ''ఈరోజు ఆటను బాగా ఎంజారు చేశాను. టాస్‌కు కొద్ది నిమిషాల ముందే నేను తుది జట్టులో ఉన్నట్లు తెలిసింది. ఇక మహీ బారు నేను బ్యాటింగ్ రావడానికి ముందు ఒకటే చెప్పాడు. 'బాగా ప్రిపేర్ అవ్వు.. నీపై ఉన్న నమ్మకంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపిస్తున్నా.. వెళ్లి ఆటను ఎంజారు చెయ్యు.. ఒత్తిడిని మాత్రం దరి చేరనీయకు.. మేమంతా నీకు సపోర్ట్‌గా ఉన్నాం.. ఈరోజు ఆట నీది.. బాగా ఆడు' అని చెప్పినట్లు రహానే పేర్కొన్నాడు.
The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V
— JioCinema (@JioCinema) April 8, 2023










