ఐపీఎల్ 2023లో సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)ని బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌సిబి 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అయితే.. విరాట్ కోహ్లి 44 బంతుల్లో 61 పరుగులు సాధించారు. డుప్లెసిస్ 46 బంతుల్లో 79 నాటౌట్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లో 59 వీర బాదుడు బాదాడు. దీంతో.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అమిత్ మిశ్రా, మార్క్ వుడ్‌కు తలో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
- మ్యాక్స్‌వెల్ 50
లక్నోతో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ 50 పరుగులతో అదరగొట్టాడు. కేవలం 25 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మ్యాక్స్ ఇన్నింగ్స్‌లో 5 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు డుప్లెసిస్ 43 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆర్‌సిబి 200 పరుగులు పూర్తి చేసింది.
- డుప్లెసిస్ 50.. ఆర్‌సిబి 146/1
కోహ్లీ ఔటయిన ఆర్‌సిబి దుకుడుగానే ఆడుతుంది. ఈ క్రమంలో డుప్లెసిస్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డుప్లెసిస్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మరోవైపు మ్యాక్స్ వెల్ 15 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆర్‌సిబి 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 146 పరుగులు చేసింది.
- 15 ఓవర్లు పూర్తి.. ఆర్‌సిబి 137/1
15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆర్‌సిబి 137 పరుగులు చేసింది. డుప్లెసిస్ 36 బంతుల్లో 46, మ్యాక్స్‌వెల్ 12 బంతుల్లో 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- కోహ్లీ ఔట్.. ఆర్‌సిబి 96/1
ఆర్‌సిబి తన తొలి వికెట్ కొల్పోయింది. 44 బంతుల్లో 61 పరుగులు చేసిన కోహ్లీ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టోనిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. డుప్లెసిస్ 26 బంతుల్లో 32 పరుగులు చేశాడు. క్రీజులోకి మ్యాచ్ వెల్ వచ్చాడు.
- 10 ఓవర్లు పూర్తి.. ఆర్‌సిబి 87/0
10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆర్‌సిబి వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 39 బంతుల్లో 58, డుప్లెసిస్ 21 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
- కోహ్లీ 50.. ఆర్‌సిబి74/0
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ 50 పరుగులు చేశాడు. 35 బంతుల్లో 3 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. మరో వైపు డుప్లెసిస్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆర్‌సిబి 9 ఓవర్లలో 74 పరుగులు చేసింది.
- దంచి కొడుతున్న కోహ్లీ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 ఓవర్లలో 56 పరుగులు చేసింది. ఇందులో కోహ్లీ ఒక్కడే 25 బంతుల్లో 3 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 11 బంతుల్లో 12 పరుగులు చేశాడు.
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపీఎల్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, అనూజ్ రావత్, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), కనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోరు, మార్క్ వుడ్, ఆవేశ్ ఖాన్










