చెన్నై: గత మ్యాచ్‌లో లఖ్‌నవూపై ఘోరంగా ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఆదివారం చెన్నైతో ఉత్కంఠపోరులో పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఓపెనర్ డేవాన్ కాన్వే (92లిబీ 52 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులను ధోనీ (13లిబీ 4 బంతుల్లో) సిక్సర్లుగా మలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ (37బీ 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. శివమ్ దూబె (28బీ 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. రవీంద్ర జడేజా (12బీ 10 బంతుల్లో), మొయిన్ అలీ (10బీ 6 బంతుల్లో 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, సామ్ కరన్, రాహుల్ చాహర్, సికిందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు.ధోని సేన నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్ చివరి వరకూ పోరాడింది. ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో సికిందర్ రజా (13లిబీ 7 బంతుల్లో 1 ఫోర్) సమయస్ఫూర్తితో ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్‌కు ఇది ఐదో విజయం కాగా.. చెన్నైకి నాలుగో ఓటమి. లక్ష్య ఛేదనలో భాగంగా పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (42బీ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (28బీ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు లివింగ్ స్టోన్ (40బీ 24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. సామ్ కరన్ (29బీ 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ ఫర్వాలేదనిపించాడు. చివరిలో షారుక్‌ఖాన్ (2లిబీ 3 బంతుల్లో), రజాలు ఆచితూచి ఆడటంతో విజయం పంజాబ్ సొంతమైంది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా రెండు, మతీష పతిరణ ఒక దక్కించుకున్నారు.










