Apr 20,2023 15:31
  • పంజాబ్‌పై 24 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపు

మొహాలీ: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బెంగళూరు ఓపెనర్లు డుప్లెసిస్‌-కోహ్లి బ్యాటింగ్‌లో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్‌ జట్టు 18.2ఓవర్లలో 150పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నాలుగు వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. తొలుత బెంగళూరు జట్టులో కెప్టెన్‌ డుప్లెసిస్‌(84; 56బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు), కోహ్లి(59; 47బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌) తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత బెంగళూరు స్కోర్‌ నెమ్మదించింది. మ్యాక్స్‌వెల్‌(0), దినేశ్‌ కార్తిక్‌(7), లామ్రోర్‌(7నాటౌట్‌), షాబాజ్‌(5నాటౌట్‌) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ రెండు వికెట్లు, నాథన్‌ ఎల్లిస్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

  • ఐపిఎల్‌లో సిరాజ్‌ అత్యుత్తమ బౌలింగ్‌..
rcb

సీజన్‌-16 ఐపిఎల్‌లో మహ్మద్‌ సిరాజ్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. మొహలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడమే గాక డైరెక్ట్‌ హిట్‌తో పంజాబ్‌ బ్యాటర్‌ను రనౌట్‌ చేయడం విశేషం. ఒక రకంగా సిరాజ్‌ ఐదు వికెట్ల ఫీట్‌(నాలుగు వికెట్లు, రనౌట్‌) సాధించినట్లే. ఇక పంజాబ్‌పై నాలుగు వికెట్ల ప్రదర్శన సిరాజ్‌కు ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ ఇదే. మ్యాచ్‌ ముగిసిన అనంతరం సిరాజ్‌ మాట్లాడుతూ.. 'మ్యాచ్‌లో తొలి బంతిని షార్ట్‌ లెంగ్త్‌ వేశాను.. కానీ తర్వాత నుంచి స్వింగ్‌పై దృష్టి పెట్టి వికెట్‌ తీయాలనుకున్నా. అది సక్సెస్‌ అయింది. నా ప్లాన్‌, ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నా. మిస్‌ఫీల్డ్‌ చేయడం సహజం.. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఫీల్డింగ్‌ను సీరియస్‌గానే తీసుకుంటా'' అని చెప్పుకొచ్చాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సిరాజ్‌కు లభించింది.

  • కోహ్లి-డుప్లెసిస్‌ సెంచరీ భాగస్వామ్యం..

టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరకు ఓపెనర్లు కెప్టెన్‌ డూప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 137 పరుగులు జతచేశారు. వీళ్లిద్దరి జోరు చూస్తే ఆర్సీబీ భారీ స్కోర్‌ చేసేలా కనిపించింది. అయితే ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌(0)ను ఔట్‌ చేశాడు. కీపర్‌ జితేశ్‌ శర్మ అద్భుత క్యాచ్‌ పట్టడంతో కోహ్లీ వెనుదిరిగాడు. దాంతో ఆర్సీబీ స్కోర్‌ వేగం తగ్గింది.
స్కోర్‌బోర్డు...
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి)జితేశ్‌ శర్మ (బి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ 59, డుప్లెసిస్‌ (సి)సామ్‌ కర్రన్‌ (బి)నాథన్‌ ఎల్లిస్‌ 84, మ్యాక్స్‌వెల్‌ (సి)అథర్వ (బి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ 0, దినేశ్‌ కార్తీక్‌ (సి)అథర్వ (బి)ఆర్ష్‌దీప్‌ 7, లామ్రోర్‌ (నాటౌట్‌) 7, షాబాజ్‌ (నాటౌట్‌) 5, అదనం 12. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 174పరుగులు.
వికెట్ల పతనం: 1/137, 2/137, 3/151, 4/163
బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 4-0-34-1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-31-2, నాథన్‌ ఎల్లిస్‌ 4-0-41-1, సామ్‌ కర్రన్‌ 4-0-27-0, రాహుల్‌ చాహర్‌ 4-0-24-0, లివింగ్‌స్టోన్‌ 1-0-9-0
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: అథర్వ (ఎలబి)సిరాజ్‌ 4, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (బి)పార్నెల్‌ 46, షార్ట్‌ (బి)హసరంగ 8, లివింగ్‌స్టోన్‌ (ఎల్‌బి)సిరాజ్‌ 2, హర్‌ప్రీత్‌ సింగ్‌ (రనౌట్‌) సిరాజ్‌ 13, సామ్‌ కర్రన్‌ (రనౌట్‌) హసరంగ 10, జితేశ్‌ శర్మ (సి)షాబాస్‌ (బి)హర్షల్‌ 41, షారుక్‌ ఖాన్‌ (స్టంప్‌) కార్తీక్‌ (బి)హసరంగ 7, హర్‌ప్రీత్‌ బ్రార్‌ (బి)సిరాజ్‌ 13, ఎల్లిస్‌ (బి)సిరాజ్‌ 1, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 0, అదనం 5. (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 150పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/20, 3/27, 4/43, 5/76, 6/97, 7/106, 8/147, 9/149, 10/150
బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-21-4, పార్నెల్‌ 3-0-32-1, హసరంగ 4-0-39-2, విజరు కుమార్‌ 3-0-29-0, మ్యాక్స్‌వెల్‌ 1-0-5-0, హర్షల్‌ పటేల్‌ 3.2-0-22-1.

  • హర్ప్రీత్‌ బ్రార్‌ క్లీన్ బౌల్డ్

147 పరుగుల వద్ద పంజాబ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో హర్ప్రీత్‌ బ్రార్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 

  • షారుఖ్‌ ఖాన్‌  స్టంపౌట్

106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ ఓటమి దిశగా పయనిస్తుంది. హసరంగ బౌలింగ్‌లో షారుఖ్‌ ఖాన్‌ (7) స్టంపౌటయ్యాడు. 

  • 10 ఓవర్లు పూర్తి.. పంజాబ్‌ కింగ్స్‌ 75/5

10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్‌ సింగ్‌ 28 బంతుల్లో 40 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతని ఇన్నింగ్‌లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. మరో వైపు జితేశ్‌ శర్మ 4 పరుగలతో క్రీజులో ఉన్నాడు.

  • సామ్‌కరన్‌ రన్‌ ఔట్‌

9 ఓవర్‌లో 5వ బంతికి సామ్‌కరన్‌ రన్‌ఔటయ్యాడు. క్రీజులోకి జితేశ్‌ శర్మ వచ్చాడు. ప్రభసిమ్రాన్‌ సింగ్‌ 40 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. పంజాబ్‌ ప్రస్తుతానికి 76/5గా ఉంది.

  • పవర్‌ ప్లే పూర్తి.. పంజాబ్‌ 49/4

పవర్‌ ప్లే పూర్తయ్యే సమయానికి పంజాబ్‌ 4 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్‌ సింగ్‌ 21, శామ్‌కరణ్‌ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఆర్‌సిబి బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 2, హసరంగ 1 వికెట్‌ తీశారు.

  • హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా రన్‌ఔట్‌

9 బంతుల్లో 13 పరుగులు చేసిన హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా రన్‌ఔటయ్యాడు. విజరు కుమార్‌ వైశాఖ్‌ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించాడు. బంతిని అందుకున్న సిరాజ్‌ డైరెక్ట్‌ త్రో వేయడంతో ఔటాయ్యడు. క్రీజులోకి శామ్‌కరన్‌ వచ్చాడు.

  • లివింగ్‌స్టోన్‌ ఎల్బీ.. పంజాబ్‌ 32/3

నాలుగు బంతుల్లో 2 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో పవర్‌ ప్లేలో పంజాబ్‌ 3వ వికెట్‌ను కోల్పోయింది. క్రీజులోకి హర్‌ప్రీత్ సింగ్ భాటియా వచ్చాడు. పంజాబ్‌ నాలుగు ఓవర్లలో 32 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.

  • రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌

పంజాబ్‌ మూడో ఓవర్‌ తొలి బంతికి రెండో వికెట్‌ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌ (8) క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి లివింగ్‌స్టోన్‌ వచ్చాడు. పంజాబ్‌ ప్రస్తుతానికి 2 వికెట్ల నష్టానికి 27పరుగులు చేసింది.

  • తొలి వికెట్‌ డౌన్‌

పంజాబ్‌ తొలి ఒవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్‌ కొట్టిన అథర్వ టైడే ఆతరువాతి బంతికి ఎల్‌బిగా పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ప్రభసిమ్రాన్‌ సింగ్‌ వచ్చాడు.

  • డుప్లెసిస్‌, కోహ్లి హాఫ్‌ సెంచరీ.. పంజాబ్‌ టార్గెట్‌ 175

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ డుప్లెసిస్‌, కోహ్లి హాఫ్‌ సెంచరీలు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. ఒకనాక 137/0 స్కోరుతో కనిపించిన ఆర్‌సీబీ, ఈజీగా 200 స్కోరు చేస్తుందనుకున్న డెత్‌ ఓవర్లలో వరుస వికెట్లు తీసిన పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు, ఆర్‌సీబీని కట్టడి చేశారు. 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న విరాట్‌ కోహ్లీ, హర్‌ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ పట్టిన సూపర్బ్‌ క్యాచ్‌కి అవుట్‌ అయ్యాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీ... ఐపీఎల్‌ 2023 సీజన్‌లో నాలుగో హాఫ్‌ సెంచరీ బాది పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అథర్వ టైడ్‌కి క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులు చేసిన ఫాఫ్‌ డుప్లిసిస్‌, నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో సామ్‌ కుర్రాన్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 137/0 స్కోరు ఉన్న ఆర్‌సీబీ, 8 బంతుల గ్యాప్‌లో 3 వికెట్లు కోల్పోయి 151/3 స్థితికి చేరుకుంది. దినేశ్‌ కార్తీక్‌ కూడా ఎప్పటికే 5 బంతుల్లో ఓ ఫోర్‌ బాది 7 పరుగులు చేసి అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. మహిపాల్‌ లోమ్రోర్‌ 9 బంతుల్లో 7, షాబజ్‌ అహ్మద్‌ 5 పరుగులు చేసి నాటౌట్‌ బ్యాటింగ్‌ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్‌కే పరిమితమైంది. హర్ప్రీత్‌ బ్రార్‌ 2, అర్షదీప్‌, ఇల్లిస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

  • డుప్లెసిస్‌ ఔట్‌..  ఆర్‌సిబి 151/3

84 పరుగులు చేసిన డుప్లెసిస్‌ నాథన్‌ ఇల్లీస్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ సామ్‌కర్‌న్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. నాథన్‌ ఇల్లీస్‌ బౌలింగ్‌లో రెండో బంతిని భారీ సిక్స్‌ కొట్టిన డుప్లెసిస్‌ తర్వాత బంతిని సిక్స్‌ కొట్టే ప్రయత్నం చేసి బౌండరీ లైన్‌ వద్ద సామ్‌కరన్‌కు చిక్కాడు. డుప్లెసిస్‌ 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 84 పరుగులు చేశాడు. క్రీజులోకి మహిపాల్‌ లోమ్రార్‌ వచ్చాడు. ఆర్‌సిబి ప్రస్తుతానికి 151 పరుగులు చేసింది.

  • మ్యాక్‌వెల్‌ గోల్డెన్‌ డక్‌

వన్‌డౌన్‌లో వచ్చిన మ్యాక్స్‌వెల్‌ గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. హార్‌ప్రీత్‌బార్‌ బౌలింగ్‌లో అథర్వ టైడేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి దినేష్‌ కార్తిక్‌ వచ్చాడు. ఆర్‌సిబి ప్రస్తుతానికి 145 పరుగులు చేసింది.

  • తొలి వికెట్‌ డౌన్‌

పంజాబ్‌ బౌలర్లు ఎట్టకేలకు వికెట్‌ను సంపాదించారు. హార్‌ప్రీత్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ 49 బంతుల్లో 59 పరుగులు చేశాడు. క్రీజులోకి మ్యాక్స్‌వెల్‌ వచ్చాడు.

  • 15 ఓవర్లు పూర్తి.. ఆర్‌సిబి 131/0

15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆర్‌సిబి వికెట్‌ నష్టపోకుండా 131 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 68, కోహ్లీ 57 పరుగుల చేశారు. మరోవైపు పంజాబ్‌ బౌలర్లు వికెట్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • కోహీ 50.. ఆర్‌సిబి 118/0

విరాట్‌ కోహ్లీ 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును అదుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్‌లో 5ఫోర్లు ఉన్నాయి. మరో వైపు డుప్లెసిస్‌ దాటిగా ఆడుతూ.. స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. డుప్లెసిస్‌ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఆర్‌సిబి ప్రస్తుతానికి 14 ఓవర్లలో 118 పరుగులు చేసింది.

డుప్లెసిస్‌ 50..  ఆర్‌సిబి 91/0

ఆర్సీబీ ఓపెనర్‌ డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ మార్కును అదుకున్నాడు. కేవలం 31 బంతుల్లో 50 పరగులు చేశాడు. డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. కోహ్లీ 29 బంతుల్లో 38 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఆర్‌సిబి 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 91 పరుగులు చేసింది.

  • ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్‌, కోహ్లి

ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్‌ (43), విరాట్‌ కోహ్లి 36) ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి ఆర్సీబీ 9 ఓవర్లలోనే 81 పరుగుల మార్కు దాటింది. డుప్లెసిస్‌ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 43 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లి 27 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేశాడు.

  • పవర్‌ ప్లే పూర్తి.. ఆర్‌సిబి 59/0

పవర్‌ ప్లే పూర్తయ్యే సమయానికి ఆర్‌సిబి 59 పరుగులు చేసింది. కోహ్లీ 19 బంతుల్లో 29 పరుగులు, డుప్లెసిస్‌ 17 బంతుల్లో 27 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లు వికెట్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • 4 ఓవర్లుకు 39

4 ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సిబి 39 పరుగులు చేసింది. కోహ్లీ 13 బంతుల్లో 20 పరుగులు, డుప్లెసిస్‌ 11 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

ఐపీఎల్‌-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ధావన్‌ అందుబాటులో లేకపోవడంతో సామ్‌ కర్రన్‌ పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ బాధ్యతలు స్వీకరించాడు.

తుది జట్లు..
పంజాబ్‌ కింగ్స్‌:
అథర్వ టైడే, మాథ్యూ షార్ట్‌, లివింగ్‌స్టోన్‌, హర్ప్రీత్‌ సింగ్‌, సికందర్‌ రజా, సామ్‌ కర్రన్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, హర్ప్రీత్‌ బ్రార్‌, నాథన్‌ ఇల్లీస్‌, రాహుల్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌

ఆర్సీబీ: డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), మహిపాల్‌ లోమ్రార్‌, మ్యాక్స్‌వెల్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగ, పార్నెల్‌, సుయాష్‌ ప్రభుదేశారు, సిరాజ్‌