- పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపు
మొహాలీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు తొలిసారి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని ముంబయి జట్టు 18.5ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు లివింగ్‌స్టోన్(82), జితేశ్ శర్మ(49నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 214పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో ముంబయి జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్(75), సూర్యకుమార్ యాదవ్(66) రాణించడంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే 216పరుగులు చేసి విజయం సాధించింది. బింద్రా స్టేడియంలో బుధవారం టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 11.2 ఓవర్లలో 95పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో లివింగ్‌స్టోన్(82 నాటౌట్), జితేశ్ శర్మ(49నాటౌట్) మరో వికెట్ పడకుండా రాణించారు. పియూష్ చావ్లాకు రెండు, ఆర్షాద్ ఖాన్‌కు ఒక వికెట్ లభించాయి. ఛేదనలో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌటైనా.. ఇషాన్-గ్రీన్ కలిసి 2వ వికెట్‌కు 54పరుగులు జతచేశారు. ఆ తర్వాత ఇషాన్-సూర్యకుమార్ కలిసి సెంచరీ (116 పరుగులు) భాగస్వా మ్యాన్ని నెలకొల్పి ముంబయిని గెలుపు తీరాలకు చేర్చారు.
Highest chase at Mohali in #TATAIPL ✅
The first team to chase consecutive 200+ totals ✅
Take a bow, @mipaltan, for making history in style 🙌#PBKSvMI #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/ZhQtl7hx3J
— JioCinema (@JioCinema) May 3, 2023
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి) ఇషాన్ (బి) అర్షద్ 9; ధావన్ (స్టంప్డ్) ఇషాన్ (బి) చావ్లా 30; షార్ట్ (బి) చావ్లా 27; లివింగ్‌స్టోన్ నాటౌట్ 82; జితేశ్ నాటౌట్ 49; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 214; వికెట్ల పతనం: 1-13, 2-62, 3-95; బౌలింగ్: గ్రీన్ 2-0-15-0; అర్షద్ 4-0-48-1; ఆర్చర్ 4-0-56-0; చావ్లా 4-0-29-2; కార్తీకేయ 3-0-24-0; ఆకాశ్ మధ్వాల్ 3-0-37-0
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) షార్ట్ (బి) రిషి 0; ఇషాన్ (సి) రిషి (బి) అర్ష్‌దీప్ 75; గ్రీన్ (సి) చాహర్ (బి) ఎలిస్ 23; సూర్యకుమార్ (సి) అర్ష్‌దీప్ (బి) ఎలిస్ 66; డేవిడ్ నాటౌట్ 19; తిలక్ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 216; వికెట్ల పతనం: 1-0, 2-54, 3-170, 4-178; బౌలింగ్: రిషి ధావన్ 3-0-20-1; అర్ష్‌దీప్ 3.5-0-66-1; సామ్ కరన్ 3-0-41-0; ఎలిస్ 4-0-34-2; రాహుల్ చాహర్ 3-0-30-0; హర్‌ప్రీత్ బ్రార్ 2-0-21-0
- దంచికొడుతున్న లివింగ్‌స్టోన్.. పంజాబ్ 20 ఓవర్లలో 214/3
లివింగ్‌స్టోన్ దంచికొడతంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లయామ్ లివింగ్‌స్టోన్ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసానికి తోడు జితేశ్ శర్మ(27 బంతుల్లో 49 నాటౌట్) ఉన్నాడు. శిఖర్ ధావన్ (30), మాథ్యూ షార్ట్ (27) ప్రబ్‌సిమ్రన్ సింగ్ (9) పరుగులు చేసి ఔటయ్యారు, ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఒక వికెట్ దక్కింది.
- 19 ఓవర్‌లో హ్యట్రిక్ సిక్స్
జోఫ్రా ఆర్చర్ వేసిన 19 ఓవర్‌లో లివింగ్‌స్టన్ తొలి 3 బంతులను హ్యట్రిక్ సిక్స్‌లుగా మలిచాడు. దీంతో పంజాబ్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. క్రీజులో లివింగ్‌స్టన్ 38 బంతుల్లో 75, జితేష్ శర్మ 25 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- లివింగ్‌స్టన్ 50
పంజాబ్ ఆటగాడు లివింగ్ స్టన్ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. క్రీజులో జితిష్ శర్మ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
- 15 ఓవర్లుకు పంజాబ్ 145/2
15 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ 145 పరుగులు చేసింది. లివింగ్‌స్టన్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 44 పరుగులు చేశాడు. జితేష్ శర్మ 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 24 పరుగులు చేశాడు.
- మాథ్యూ షార్ట్ ఔట్
26 బంతుల్లో 27 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ చావ్లా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి జితేష్ శర్మ వచ్చాడు. పంజాబ్ ప్రస్తుతం 95 పరుగులు చేసింది.
- 10 ఓవర్లుకు పంజాబ్ 78/2
10 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. లివింగ్‌స్టన్ 10 బంతుల్లో 11 పరుగలు, మాథ్యూ షార్ట్ 23 బంతుల్లో 24 (2 ఫోర్లు, 1 సిక్స్)పరుగులు చేశారు. అంతకు ముందు శిఖర్ ధావన్ (30), ప్రబ్‌సిమ్రన్ సింగ్ (9) పరుగులు చేసి ఔటయ్యారు.
- ధావన్ ఔట్
పియుష్ చావ్లా బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (30) స్టంపౌటయ్యాడు. క్రీజులోకి లివింగ్‌స్టన్ వచ్చాడు. పంజాబ్ ప్రస్తుతం 62 పరుగులు చేసింది.
- పవర్ ప్లే పూర్తి.. పంజాబ్ 50/1
పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి పంజాబ్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. మాథ్యూ షార్ట్ 14 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- 3 ఓవర్లు పూర్తి
3 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 10, మాథ్యూ షార్ట్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- ప్రబ్‌సిమ్రన్ సింగ్ ఔట్
9 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్ సింగ్ అర్షద్ ఖాన్ బౌలింగ్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 17/1గా ఉంది. క్రీజులోకి మాథ్యూ షార్ట్ వచ్చాడు.
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం మొహలీ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్










