Apr 13,2023 21:46

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లలోమాథ్యూ షార్ట్‌ 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షారుక్‌ ఖాన్‌ 9 బంతుల్లో 22 పరుగులు చేశాడు. జితేశ్‌ శర్మ 25, సామ్‌ కరాన్‌ 22 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, జాషువా లిటిల్‌, అల్జారీ జోసెఫ్‌, రషీద్‌ ఖాన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

  • షారుక్  రనౌట్

 మోహిత్ శర్మ  వేసిన 19వ ఓవర్లో తొలి బంతికే కరన్ ఔటయ్యాడు. ఆ ఓవర్లో షారుక్ ఓ ఫోర్ కొట్లాడు. జోషువా లిటిల్ వేసిన చివరి ఓవర్లో   హర్‌ప్రీత్ బ్రర్ ఓ సిక్సర్ బాదగా రిషి ధావన్ రనౌట్ అయ్యాడు. 

  • భానుక రాజపక్స ఔట్‌..  పంజాబ్‌ 121/5

20 పరుగుల వద్ద రాజపక్స ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో శుభ్‌మాన్‌గిల్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతానికి పంజాబ్‌ 17 ఓవర్లలో 121 పరుగులు చేసింది. క్రీజులో సామ్‌ కరన్‌,షారుక్‌ ఖాన్‌ ఉన్నారు.

  • 15 ఒవర్లు పూర్తి

15 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్‌ 99 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌, భానుక రాజపక్స నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • జితేష్‌ శర్మ 25 ఔట్‌

25 పరగులు చేసిన జితేష్‌ శర్మ మోహిత్‌ శర్శ బౌలింగ్‌లో వృద్ధిమాన్‌సాహాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతానికి పంజాబ్‌ 13 ఒవర్లలో 94 పరుగులు చేసింది. క్రీజులోకి భానుక రాజపక్స 17, సామ్‌కరన్‌ క్రీజులో ఉన్నారు.

  • 10 ఓవర్లు పూర్తి.. పంజాబ్‌ 75/3

10 ఓవర్లు పూర్తియ్యే సరికి పంజాబ్‌ 75 పరుగులు చేసింది. జితేష్‌ శర్మ 16 బంతుల్లో 15 పరుగులు, భానుక రాజపక్స 10 బంతులో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (0),శిఖర్‌ ధావన్‌ (8), మాథ్యూ షార్ట్‌ (36) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు.

  • రషీద్‌ఖాన్‌కు తొలి వికెట్‌.. పంజాబ్‌ 53/3

రషీద్‌ఖాన్‌కు తన తొలి ఒవర్‌లోనే వికెట్‌ను దక్కించుకున్నాడు. 36 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్‌ రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. పంజాబ్‌ ప్రస్తుతానికి 53 పరుగులు చేసింది. క్రీజులోకి జితేష్‌ శర్మ వచ్చాడు.

 

  • పవర్‌ ప్లే పూర్తి.. పంజాబ్‌ 52/2

పవర్‌ ప్లే పూర్తయ్యే సమయానికి పంజాబ్‌ 2 వికెట్ల నష్టానికి 52 పరగులు చేసింది. మాథ్యూ షార్ట్‌ 22 బంతుల్లో 6 ఫోర్లు 1సిక్స్‌ సాయంతో 35 పరుగులు చేశాడు. భానుక రాజపక్స 4 బంతుల్లో 3 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • రెండో వికెట్‌ డౌన్‌.. పంజాబ్‌ 28/2

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కింగ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జాషువా లిటిల్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. శిఖర్‌ ధావన్‌ 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులోకి భానుక రాజపక్స వచ్చాడు. పంజాబ్‌ ప్రస్తుతానికి 28 పరుగులు చేసింది.

  • ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ డక్‌ ఔట్‌

పంజాబ్‌కింగ్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ డక్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. షమీ బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మాథ్యూ షార్ట్‌ వచ్చాడు.

  • టాస్‌ గెలిచిన టైటాన్స్‌.. ఫీల్డింగ్‌

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గురువారం 18వ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటన్స్‌ ఒక మార్పుతో బరిలోకి దిగింది. యష్‌ దయాల్‌ స్థానంలో మోహిత్‌ శర్మ జట్టులోకి వచ్చాడు.
పంజాబ్‌ కింగ్స్‌ : ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), మాథ్యూ షార్ట్‌, భానుక రాజపక్స, జితేష్‌ శర్మ(వికెట్‌ కీపర్‌), సామ్‌ కర్రాన్‌, షారుక్‌ ఖాన్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, కగిసో రబడ, రిషి ధావన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

గుజరాత్‌ టైటాన్స్‌ : వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), శుభమాన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, అల్జారీ జోసెఫ్‌, మహమ్మద్‌ షమీ, మోహిత్‌ శర్మ, జాషువా లిటిల్‌