న్యూఢిల్లీ : వచ్చే ఏడాది 2023లోనూ భారత బ్యాంక్‌లు లాభాదయకతను ప్రదర్శించనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బాకీలు తగ్గి.. లాభాలు మరింత పెరగనున్నాయని పలు రిపోర్టులు అంచనా వేస్తున్నాయి. 2023లో రుణాలకు మంచి డిమాండ్ ఉండనుంది. అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ లాభాలను గడించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశంలోని 12 పిఎస్‌బిలు బ్యాంకింగ్ మొత్తం వ్యాపారంలో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వాటి లాభాలు 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యాయి. 12 బ్యాంక్‌ల్లో పిఎస్‌బి, బిఒఐ లాభాల్లో మాత్రమే తగ్గుదల చోటు చేసుకుంది. అదే విధంగా సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంక్‌ల మొండి బాకీలు 7.28 శాతానికి తగ్గాయని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ లోకసభకు తెలిపారు.










