Jul 14,2023 08:44
  • బిసిసిఐ సూచనలకు స్పందించిన ఐసిసి

లండన్‌ : క్రికెట్‌లో లింగ సమానత్వం కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఐసిసి నిర్వహించే టోర్నీల్లో పురుష, మహిళా క్రికెటర్ల ఒకే రకమైన ప్రైజ్‌మనీని అందివ్వనున్నట్లు ప్రకటించింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) చేసిన ప్రతిపాదనకు ఐసిసి ఆమోదం తెలుపుతూ గురువారం నిర్ణయం తెలిపింది. భారత క్రికెట్‌లో సమాన వేతనాలు అందిస్తున్న బిసిసిఐ.. ఐసిసి నిర్వహించే టోర్నీల ప్రైజ్‌మనీలోనూ వ్యత్యాసం లేకుండా చూడాలని ఐసిసిని కోరింది. ఐసిసి బోర్డులోని ఇతర సభ్యులు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించడంతో ఐసిసి మెగా టోర్నీల ప్రైజ్‌మనీ విషయంలో వ్యత్యాసం లేకుండా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బిసిసిఐ సెక్రటరీ జై షా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.