Apr 08,2023 21:50

సెమీస్‌లో నుయెన్‌పై వరుససెట్లలో గెలుపు
ఓర్లీన్‌(ఫ్రాన్స్‌): ఓర్లీన్‌ మాస్టర్స్‌ సూపర్‌300 బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లోకి ప్రియాంశు రాజవత్‌ ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీస్‌లో ప్రియాంశు 21-12, 21-9పాయింట్ల తేడాతో నాట్‌ నుయోన్‌(ఐర్లాండ్‌)పై వరుససెట్లలో విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌ను ప్రియాంశు కేవలం 44 నిమిషాల్లోనే ముగించాడు. తొలి గేమ్‌ అర్ధభాగం ముగిసే సమయానికి ప్రియాంశు11-9తో నిలిచినా.. రెండో అర్ధభాగంలో చెలరేగి ఆడాడు. ప్రత్యర్థికి కేవలం 3పాయింట్లు మాత్రమే ఇచ్చి ఆ గేమ్‌ను 21-12తో ముగించాడు. ఇక రెండో గేమ్‌లో అయితే అర్ధభాగం ముగిసే సమయానికే 11-3పాయింట్ల ఆధిక్యతలో నిలిచి ఆ గేమ్‌ను 21-8తో ముగించి మ్యాచ్‌ను ముగించాడు. బిడబ్ల్యుఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ప్రియాంశు 58వ ర్యాంక్‌లో ఉండగా.. నుయోన్‌ 35వ ర్యాంక్‌ ఆటగాడు. ఆదివారం జరిగే ఫైనల్లో లియె(చైనా)-జన్నాసెన్‌(డెన్మార్క్‌) మ్యాచ్‌ విజేతతో తలపడనున్నాడు.