Jul 15,2023 12:05

రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోడీ యూఏఈకి చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఎనర్జీ, ఫుడ్‌ సెక్యూరిటీ, ఢిఫెన్స్‌ రంగాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.