న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానాల్లో కొత్తగా ప్రీమియం ఎకానమీ క్లాసును ప్రవేశపెట్టనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. వచ్చే నెలలో ఈ కొత్త ఎకానమీ క్లాస్ అందుబాటులోకి రానుందని ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. తన మార్కెట్ వాటాతో పాటు గ్లోబల్ నెట్‌వర్క్‌ను విస్తరించే మార్గాలపై టాటా గ్రూపునకు చెందిన తమ సంస్థ కఅషి చేస్తుందన్నారు. అంతర్జాతీయ మార్గాల్లో ఎయిర్‌లైన్ తన మార్కెట్ వాటాను కనీసం 30 శాతానికి పెంచుకుంటుందన్నారు.










