ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్యజిల్లా) : సన్ స్ట్రోక్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి యం.వి.కిషోర్ కుమార్‌రెడ్డి సూచించారు. మండలంలోని నవాబుపేట గ్రామపంచాయతీలో వైద్యాధికారి ఎంవి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. అసంక్రమమైన వ్యాధులు బీపీలు షుగరు వ్యాధులను స్క్రీనింగ్ చేయాలని తెలిపారు. వేసవిలో జరిగే సన్ స్ట్రోక్ గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం 10 గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలం పనులకు వెళ్లాలని సూచించారు. 81 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి.హెచ్ ఈ ఓ జి జయరామయ్య, ఎంపిహెచ్‌ఎస్ ఎస్.ముజీబ్ బాషా, బి.రెడ్డమ్మ, ఎం.ఎల్.హెచ్.పి.కనకమ్మ ఆరోగ్య కార్యకర్త జె.భాగ్యమ్మ, శివప్రసాద్ బాబు, డేటా ఎంట్రీ ఆపరేటర్ రోజా, పైలట్ రమేష్ బాబు, ఆశా కార్యకర్త సి.అనంతరాణి పాల్గొన్నారు.










