Jun 16,2023 22:06

క్వార్టర్స్‌లో ఓడిన శ్రీకాంత్‌
ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

జకార్తా: ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌, డబుల్స్‌లో జోడీ సెమీఫైనల్లోకి చేరారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌ సింగిల్స్‌ విభాగంలో హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ డబుల్స్‌లో సాత్త్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ వరుససెట్లలో గెలుపొందగా.. మరో పోటీలో కిదాంబి శ్రీకాంత్‌ మూడు సెట్ల హోరాహోరీ పోరులో పరాజయాన్ని చవిచూశాడు. హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ 21-18, 21-16తో జపాన్‌ యువ షట్లర్‌ కొడారు నరోకాపై, డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్త్విక్‌ సాయిరాజ్‌ జోడీ 21-13, 21-13తో టాప్‌సీడ్‌ ఇండోనేషియా జోడీని ఓడించి సెమీస్‌కు చేరారు. ఈ మ్యాచ్‌ కేవలం 41నిమిషాల్లోనే ముగిసింది. ఇక కిదాంబి శ్రీకాంత్‌ 14-21, 21-14, 12-21తో చైనాకు చెందిన లిాషిాఫెంగ్‌ చేతిలో పోరాడి ఓడాడు. మూడో గేమ్‌లో ఓ దశలో శ్రీకాంత్‌ 8-11పాయింట్లతో దగ్గరకు వచ్చినా.. విరామం తర్వాత ఒత్తిడికి గురై వరుసగా పాయింట్లను చేజార్చుకొని పరాజయాన్ని చవిచూశాడు.