Jun 23,2023 22:07

తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
తైపీ: తైపీ ఓపెన్‌ సూపర్‌300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరి ఆశలు రేపిన హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ ఓటమిపాలయ్యాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 9వ ర్యాంకర్‌ ప్రణయ్ 19-21, 8-21తో హాంకాంగ్‌కు చెందిన లాంగ్‌-అంగస్‌ చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో లాంగ్‌ 5వ ర్యాంక్‌లో ఉన్నాడు. తొలి గేమ్‌లో ప్రణరు తొలుత 6ా5పాయింట్లతో ఆధిక్యతలో నిలిచాడు. తొలి గేమ్‌ పోటాపోటీగా సాగింది. ఇదే క్రమంలో 12-12, 19-19పాయింట్లతో లాంగ్‌కు సమంగా నిలిచాడు. ఆ తర్వాత ప్రణరు వరుసగా రెండు పాయింట్లు కోల్పోవడంతో లాంగ్‌ ఆ గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో ప్రణరు ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు.