Jun 22,2023 22:15

తైపీ: తైపీ సూపర్‌300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ సత్తాచాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లో టామీ సుగిర్తోను ఓడించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఏకపక్షంగా సాగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ప్రణరు రారు 21-9, 21-17 తేడాతో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగిర్తోపై సునాయాసంగా నెగ్గాడు. ఈ మ్యాచ్‌ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో ప్రణరు.. ఐదో ర్యాంకర్‌ అగస్‌ నకాలాంగ్‌తో తలపడనున్నాడు. మరో ప్రి క్వార్టర్‌ ఫైనల్లో పారుపల్లి కశ్యప్‌ ఓటమిపాలయ్యాడు. ప్రి క్వార్టర్స్‌లో కశ్యప్‌ 16-21, 17-21తో సు-లీ-యంగ్‌(తైపీ) చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూశాడు.
మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ నిరాశే..
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్‌ కపూర్‌ జోడీ ప్రి క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. తొలిరౌండ్‌లో నెగ్గి ప్రి క్వార్టర్స్‌కు చేరిన భారత జంట తైపీకి చెందిన చియు హ్సియాంగ్‌-లిన్‌ షియో చేతిలో 13-21, 18 -21 తేడాతో ఓడిపోయింది. మహిళా ప్లేయర్‌ తన్యా కామత్‌ కూడా 11-21, 6-21 తేడాతో తై జు యింగ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో ఈ టోర్నీలో మిగిలిన ఏకైక షట్లర్‌ ప్రణయ్ రాయ్ మాత్రమే.