Jul 14,2023 21:23

బెంగళూరు : దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌తో మొబైల్‌ ఫోన్ల తయారీదారు పోకో భాగస్వామ్యం కుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా పోకో సి51 స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరలో ఎయిర్‌టెల్‌ ఖాతాదారులకు అందించనున్నట్లు పోకో పేర్కొంది. 4జిబి ర్యామ్‌, 64 జిబి వేరియంట్‌ కలిగిన ఈ 4జి స్మార్ట్‌ఫోన్‌ను జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కే ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇది ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కనెక్షన్‌తో లాక్‌ అయి ఉంటుందని తెలిపింది.