Jul 18,2023 21:30

కడప : టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు. స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చని టమాటాలు కొనుగోలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలు పూర్తయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.120 నుంచి 150 వరకు ఉండటంతో రైతు బజారులో కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు.