ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరు వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి కపుల్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వి211ఏ జోనల్ చైర్మన్ విఎన్.పామిడి జయచంద్ర తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వారితో ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించామన్నారు. పీలేరు వాసవి క్లబ్ గ్రేటర్ నూతన అధ్యక్షులుగా జూటూరు అరవింద్ బాబు, కార్యదర్శిగా ఆమూరి శివఫణేష్, కోశాధికారిగా కొత్తమాసి గోవర్ధన్, కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. వాసవి కపుల్స్ నూతన అధ్యక్షుడిగా ఆమూరి మహీధర్, సెక్రెటరీ వెంకట సురేష్ బాబు, ట్రెజరర్ ఆమూరి శంకర్, కమిటీ సభ్యులతో జిల్లా వి211ఏ గవర్నర్ వెంకటేష్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విఎన్. కట్టా అమర్, గౌరవ అతిథులుగా విఎన్. నామ సతీష్, విఎన్. రాచపల్లి బాలాజీ, విఎన్. కెఎస్. కఅష్ణమూర్తి, విఎన్. ఇస్సా నాగలక్ష్మి, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ విఎన్. పామిడి నాగరాజ, క్యాబినెట్ సెక్రటరీ విఎన్. కె. ప్రభాకర్, క్యాబినెట్ ట్రెజరర్ విఎన్. ఏవి. శివ ప్రసాద్, వైస్ గవర్నర్ విఎన్. సోమిశెట్టి సురేష్ బాబు, డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ విఎన్. కూనా ప్రభాకర్ శెట్టి, జోనల్ చైర్మన్లు విఎన్. పామిడి జయచంద్ర, విఎన్. గ్రందే నర్సింహులు శెట్టి, డిపిఓ విఎన్. మెతుకు మురళి, విఎన్. కూనా చెంగయ్య, సభ్యులు పాల్గొన్నారు.










