May 04,2023 21:55

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌
కరాచీ: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో జరిగిన మూడో వన్డేలోనూ పాకిస్తాన్‌ జట్టు 26పరుగుల తేడాతో గెలిచింది. బుధవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 287పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇమామ్‌-ఉల్‌-హక్‌(90), కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(54) అర్ధసెంచరీలకి తోడు, రిజ్వాన్‌(32), అఘా సల్మాన్‌(31) బ్యాటింగ్‌లో రాణించారు. హెన్రీకి మూడు, మిల్నేకు రెండు, మెక్‌కోంకీకి ఒక వికెట్‌ దక్కాయి. ఛేదనలో న్యూజిలాండ్‌ జట్టు 49.1ఓవర్లలో 261పరుగులకు కుప్పకూలింది. బ్లండెల్‌(65), మెక్‌కోంకి(64) అర్ధసెంచరీలతో రాణించినా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ నిరాశపరిచారు. కెప్టెన్‌ లాథమ్‌(45) కూడా బ్యాటింగ్‌లో రాణించాడు. షాహిన్‌షా, నసీమ్‌ షా, మహ్మద్‌ వాసీం జూనియర్‌కు రెండేసి, అఘా సల్మాన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇమామ్‌-ఉల్‌-హక్‌కు లభించింది. దీంతో పాకిస్తాన్‌ జట్టు ఐదు వన్డేల సిరీస్‌ను 3ా0తో చేజిక్కించుకోగా.. నాల్గో వన్డే శుక్రవారం జరగనుంది.