Sep 28,2023 10:38

హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా మజిలీస్‌ ఏ ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ వరుసగా నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఓవైసీ ఒక్కరే నామినేషన్‌ వేయగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటించింది. త్వరలో నూతన కార్యవర్గ నియామకం జరుగుతుందని తెలిపింది.