బెంగళూరు: భారత ఫుట్‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. శాఫ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టిమాక్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడు మ్యాచ్ రిఫరీ నుంచి రెడ్ కార్డ్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం రిఫరీ, కమిషనర్ నివేదిక ప్రకారం సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్) జనరల్ సెక్రటరీ అన్వరుల్ హక్‌కు పంపగా.. గొడవకు మూలకారకుడైన స్టిమాక్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు శాఫ్ క్రమశిక్షణా కమిటీ స్టిమాక్‌పై నిషేధం విధించింది. దీంతో భారతజట్టు మంగళవారం కువైట్‌తో తలపడే మ్యాచ్‌కు స్టిమాక్ దూరం కానున్నాడు.










